” సైరా ” టీజర్.. పవర్ స్టార్ వాయిస్ తో సై సై సైరా నరసింహా రెడ్డి..! - Watch Telugu

728x90 AdSpace

Trending
Wednesday, August 21, 2019

” సైరా ” టీజర్.. పవర్ స్టార్ వాయిస్ తో సై సై సైరా నరసింహా రెడ్డి..!మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. ముంబైలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడం విశేషం. తెలుగు, తమిళ, హింది భాషల్లో అక్టోబర్ 2న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక సినిమా టీజర్ ను మెగాస్టార్ బర్త్ డే కానుకగా రెండు రోజుల ముందే రిలీజ్ చేశారు.

ఇక టీజర్ విషయానికొస్తే.. ఈ వయసులో కూడా చిరు స్టామినా ఏమాత్రం తగ్గలేదని టీజర్ లో ఆయన్ను చూస్తేనే తెలుస్తుంది. సైరా సినిమా మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచేలా చేస్తుందని టీజర్ చూసి చెప్పొచ్చు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచగా సైరా మరో బాహుబలి అవడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. భారీ బడ్జెట్ తో అదే రేంజ్ భారీ తనంతో టీజర్ చూస్తేనే ఒళ్లు గగుర్పొడించేలా ఉన్న సైరా టీజర్ అదరగొట్టగా సినిమా కోసం ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఎదురుచూసేలా చేశాడు.

సురేందర్ రెడ్డి డైరక్షన్, ఆర్ట్, యాక్షన్, మేకింగ్, సినిమాటోగ్రఫీ అన్ని అంశాలు అద్భుతంగా కుదిరినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు టీజర్ కు పవర్ స్టార్ వాయిస్ చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. మెగాస్టార్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు ఇంతకంటే గొప్ప గిఫ్ట్ మరోటి ఉండదేమో.. అక్టోబర్ 2న సైరా సంచలనానికి అందరు సిద్ధం అవడమే ఇక తరువాయి.

” సైరా ” టీజర్.. పవర్ స్టార్ వాయిస్ తో సై సై సైరా నరసింహా రెడ్డి..! Reviewed by Watch Telugu on August 21, 2019 Rating: 5 మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. ముంబైలో ఈ సినిమా టీజర్ రిలీజ్...

No comments: