హైదరాబాద్‌ మెట్రోలో పాము..! - Watch Telugu

728x90 AdSpace

Trending
Wednesday, August 21, 2019

హైదరాబాద్‌ మెట్రోలో పాము..!హైదరాబాద్‌లో మెట్రోలో పాము ప్రత్యక్షం ప్రయాణికుల్లో కలకలాన్ని రేపింది. దాదాపు 2500 కిమీ ప్రయాణించింది అంటే 80 ట్రిప్పులకు పైగానే తిరిగింది. దాదాపు ఆరు రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు చిక్కింది. వివరాల్లోకి వెళ్తే ఆగష్టు 14వ తేదీన డీబీ 031నంబరు గల రైలు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ బయల్దేరింది. దిల్‌సు‌ఖ్‌నగర్ రాగానే పైలట్ డ్యాష్‌బోర్డులో ఓ పాము కనిపించింది. 

దీంతో అప్రమత్తమైన పైలట్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు, వారు అక్కడికి చేరుకునే లోపే పాము కనిపించకుండా పోయింది. రైళ్లోని క్యాబిన్‌లో ఎంత పరిశీలించిన పాము ఆచూకీ లభించలేదు, అయితే మళ్లీ ఆగష్టు 19వ తేదీన దిల్‌సుఖ్‌నగర్ రాగానే అదే క్యాబిన్‌లో పాము ప్రత్యక్షమవ్వడంతో పైలట్ అప్రమత్తమై స్నేక్ ఆఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ సారి పామును పట్టుకున్నారు.
హైదరాబాద్‌ మెట్రోలో పాము..! Reviewed by Watch Telugu on August 21, 2019 Rating: 5 హైదరాబాద్‌లో మెట్రోలో పాము ప్రత్యక్షం ప్రయాణికుల్లో కలకలాన్ని రేపింది. దాదాపు 2500 కిమీ ప్రయాణించింది అంటే 80 ట్రిప్పులకు పైగానే తిరిగ...
Next
This is the most recent post
Older Post

No comments: