ప్లాస్టిక్‌తో ఇళ్లు కట్టేస్తామంటున్న హైదరాబాదీలు - Watch Telugu

728x90 AdSpace

Trending
Wednesday, August 21, 2019

ప్లాస్టిక్‌తో ఇళ్లు కట్టేస్తామంటున్న హైదరాబాదీలుహైదరాబాద్ లోని దంపతులు అతి తక్కువ ధరకే ఎక్కువ కాలం ఉండేలా అది కూడా వాడేసిన ప్లాస్టిక్ పదార్థాలతో ఇళ్లు కట్టిస్తాం అంటూ వినూత్నంగా ముందుకు వచ్చారు. ఇంట్లో ఉండాల్సిన ఫర్నీచర్‌తో పాటు గోడలు, టైల్స్ వంటివి కూడా రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారుచేస్తున్నారు. గృహ నిర్మాణంలో పదేళ్ల అనుభవం ఉన్న ప్రశాంతం లింగం, అరుణ దంపతులు ఈ కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు.ప్రశాంత్ మాట్లాడుతూ.. 'ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రోజురోజుకూ పెరుగుతున్న ప్లాస్టిక్ పదార్థాల వినియోగం మాకు ఈ ఆలోచన వచ్చేలా చేసింది. పాల ప్యాకెట్లలో ఉండే ప్లాస్టిక్‌తో ఫర్నీచర్, టాయిలెట్స్, బెంచ్, బస్ షెల్టర్ నిర్మాణాలు చేపడుతున్నాం' అని తెలియజేశారు. లింగం తొలి సారి ఉప్పల్ ప్రాంతంలో ప్లాస్టిక్‌తో 800చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనికి 7టన్నుల ప్లాస్టిక్ వాడారు.ఈ ఇళ్లు ఇటుకల ఇంటిలాగే బలంగా ఉంటుందని అలాగే కేవలం అడుగుకు 700 రూపాయల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేయవచ్చు అని చెబుతున్నారు. అలాగే ఈ ఇంటి లైఫ్ కూడా 30-40 యేళ్లు ఉంటుందట.


ప్లాస్టిక్‌తో ఇళ్లు కట్టేస్తామంటున్న హైదరాబాదీలు Reviewed by Watch Telugu on August 21, 2019 Rating: 5 హైదరాబాద్ లోని దంపతులు అతి తక్కువ ధరకే ఎక్కువ కాలం ఉండేలా అది కూడా వాడేసిన ప్లాస్టిక్ పదార్థాలతో ఇళ్లు కట్టిస్తాం అంటూ వినూత్నంగా ముందు...

No comments: